గిల్ను 3వ స్థానంలో ఆడించడంపై తండ్రి అసంతృప్తి
- గిల్ను 3వ స్థానంలో దింపడం సరైన నిర్ణయం కాదన్న తండ్రి లఖ్విందర్
- డ్రెస్సింగ్ రూమ్లో ఎక్కువ సేపు ఉంటే అతడిపై ఒత్తిడి పెరుగుతుందని వ్యాఖ్య
- మూడో స్థానం అంటే మిడిలార్డరేనని కామెంట్
ఇంగ్లండ్తో ప్రస్తుత సిరీస్కు ముందు 12 ఇన్నింగ్స్ ఆడినా ఒక్క అర్ధశతకం కూడా చేయలేకపోయాడు. మరోవైపు, రంజీల్లో ఛటేశ్వర్ పూజారా అద్భుత ఫాం కనబరచడంతో గిల్ స్థానంలో అతడు ఆరంగేట్రం చేయొచ్చన్న వ్యాఖ్యలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న గిల్ టెస్టుల్లో తొలిసారిగా సెంచరీ సాధించి విమర్శకులకు దీటైన సమాధానం ఇచ్చాడు. మూడో స్థానంలో ఆడుతూనే అతడీ శతకం సాధించాడు. ఆ తరువాత శుక్రవారం ధర్మశాలలో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్లోనూ మరోమారు మూడంకెల స్కోరు చేసి తన సత్తా చాటాడు. అయితే, గిల్ను మూడో స్థానంలో ఆడించడంపై అతడి తండ్రి, తొలి కోచ్ లఖ్విందర్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు.