రాష్ట్ర సచివాలయాన్నీ తాకట్టు పెట్టేశారు.. జగన్ పై చంద్రబాబు ఫైర్
- తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారన్న మాజీ సీఎం
- ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను నాశనం చేశారని విమర్శ
- ఏపీని మరో శ్రీలంకలా మార్చేస్తున్నాడు..: లోకేశ్ ట్వీట్
జగన్ చేస్తున్న అప్పులతో ఆర్థికవేత్తలు కూడా షాక్: లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ను మరో శ్రీలంకలా మార్చేస్తున్నారని జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. జగన్ చేస్తున్న అప్పులు చూసి ఆర్థికవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని రూ.12.5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన జగన్.. చివరకు సెక్రటేరియట్ ను కూడా వదలలేదని మండిపడ్డారు. పీకలలోతు అప్పుల్లో మునిగిపోయిన శ్రీలంక కూడా తమ పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టలేదని లోకేశ్ చెప్పారు. జగన్ పనితనాన్ని చూశాక రాష్ట్రాన్ని శ్రీలంకతో పోల్చడం కూడా సరికాదని అనిపిస్తోందన్నారు. ఇంతకంటే దిగజారలేరని అనుకున్న ప్రతిసారీ మరో మెట్టు దిగిపోతూ జగన్ ఏపీ పరువును మంటగలుపుతున్నారని లోకేశ్ విమర్శించారు.