Chandrababu: తొలి జాబితాను ప్రకటించాం... ఏపీ ప్రజలారా ఆశీర్వదించండి: చంద్రబాబు

Chandrababu seeks blessings from AP People after announced first list
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ-జనసేన పొత్తు నేపథ్యంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ, జనసేన పార్టీలు తమ తొలి జాబితాను ప్రకటించాయి. తొలి జాబితాలో టీడీపీ 94 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. జనసేనకు 24 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాలు కేటాయించారు. ఈ క్రమంలో చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. 

దేశంలో మొట్టమొదటిసారిగా... విస్తృత స్థాయిలో 1 కోటి 3 లక్షల 33 వేల మంది ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి తొలి జాబితా ప్రకటించామని వెల్లడించారు. నిజాయతీ, అంకితభావంతో కూడిన ప్రజాసేవ ప్రాతిపదికగా ఎంపిక చేసిన టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితా ఇది అని వివరించారు. ఏపీ ప్రజలారా... ఆశీర్వదించండి అని విజ్ఞప్తి చేశారు.

Go Back to Shorts
Chandrababu
First List
TDP
Janasena
Elections
Andhra Pradesh

More Telugu News