2019లోనే చంద్రబాబు, లోకేశ్ కుర్చీలను మడతపెట్టేశాం: పేర్ని నాని
- షామియానా షాపుల్లో కుర్చీలను అద్దెకు తెచ్చుకోవడం వల్ల ఉపయోగం లేదన్న పేర్ని నాని
- చంద్రబాబుకు నిలువెల్లా మచ్చలే అని ఎద్దేవా
- ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని విమర్శ
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఒక్క పథకమైనా ఉందా? అని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని అన్నారు. జగన్ 99 శాతం హామీలను అమలు చేశారని కొనియాడారు. బందరు పోర్టును చంద్రబాబు పూర్తి చేయలేదని విమర్శించారు. హైదరాబాద్ నుంచి బందరుకు ఉద్యోగాలను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తానని మోసం చేశారని మండిపడ్డారు.