ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసిన సిరిసిల్ల రాజయ్య

Sircilla Rajaiah meets Mallu Bhatti Vikramarka
  • ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రాజయ్య
  • అనంతరం ప్రజాభవన్‌లో ఉపముఖ్యమంత్రితో సమావేశం
  • పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన మల్లు భట్టి
తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా సిరిసిల్ల రాజయ్య సోమవారం ఉదయం బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజాభవన్‌లో ఉపముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాజయ్యకు మల్లు భట్టి విక్రమార్క పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కమిషన్ చైర్మన్‌గా వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా అజ్మతుల్లా హుసేన్‌ను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫైనాన్స్‌ కమిషన్‌లో సభ్యులుగా ఎం రమేశ్, సంకేపల్లి సుధీర్ రెడ్డి, మాలోత్‌ నెహ్రూ నాయక్‌లను నియమించింది.
Go Back to Shorts
sircilla rajaiah
Telangana
Mallu Bhatti Vikramarka
Congress

More Telugu News