Advertisement

ఓటీటీ తెరపైకి మరో హారర్ థ్రిల్లర్!

Valari Movie Update
  • రితికా సింగ్ ప్రధాన పాత్రగా 'వళరి' 
  • హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే సినిమా
  • స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్న ఈటీవీ విన్    
  • మార్చి 6వ తేదీ నుంచి అందుబాటులోకి  

రితికా సింగ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులో 'గురు' సినిమాతో ఆమె ఇక్కడి ప్రేక్షకులకు చేరువైంది. ఆ తరువాత హారర్ మూవీ  'శివలింగ'తో, ఇక్కడి ప్రేక్షకులను భయపెట్టేసింది. తమిళ .. మలయాళ భాషల్లోను సినిమాలు చేస్తూ ఆమె ముందుకు వెళుతోంది. అలాంటి రితిక సింగ్ ప్రధానమైన పాత్రగా రూపొందిన సినిమానే 'వళరి'.

'వళరి' అనేది తమిళనాడు ప్రాంతం వైపు ఉపయోగించే ఒక ఆయుధం పేరు. ఆంగ్లేయుల కాలంలో ఈ ఆయుధాన్ని ఉపయోగించడాన్ని నిషేధించారు. ఈ ఆయుధంతో పాటు దెయ్యం నేపథ్యంతో కూడిన కథతో ఈ సినిమా నడుస్తుందని అంటున్నారు. ఈటీవీ విన్ వారు ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నారు. 

మార్చి 6వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. మ్రితికా సంతోషిణి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, దివ్య పాత్రలో రితికా నటించింది. ఆమె జోడీగా కెప్టెన్ నవీన్ నాయుడు పాత్రలో శ్రీరామ్ కనిపించనున్నాడు. వైవిధ్య భరితమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి.
Advertisement
Rithika
Sri Ram
Valari Movie

More Telugu News