తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Rush increases in Tirumala
  • వారాంతం కావడంతో తిరుమలకు భారీగా తరలి వస్తున్న భక్తులు
  • టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
  • నిన్న ఒక్కరోజే స్వామివారికి రూ.4.31 కోట్ల ఆదాయం
వారాంతం కావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు తిరుమల కొండకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సర్వదర్శనం టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో నాలుగు కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. కాగా, నిన్న కూడా తిరుమల శ్రీవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. శుక్రవారం నాడు స్వామివారిని 62,593 మంది దర్శించుకున్నట్టు టీటీడీ వెల్లడించింది. హుండీ ద్వారా ఒక్కరోజులో రూ.4.31 కోట్ల ఆదాయం లభించినట్టు తెలిపింది.
Advertisement
Tirumala
Devotees
Darshan
TTD

More Telugu News