పార్టీ చేసుకుంటూ.. 'వ్యూహం' రిలీజ్ డేట్ ని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ
Add ap7am to your home Screen

పార్టీ చేసుకుంటూ.. 'వ్యూహం' రిలీజ్ డేట్ ని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma announces Vyuham release date
  • ఫిబ్రవరి 23న సినిమా విడుదల కాబోతోందన్న వర్మ
  • అడ్డంకులన్నీ తొలగిపోయాయని వెల్లడి
  • వ్యూహం రిలీజ్ ను సెలెబ్రేట్ చేసుకుంటున్నామన్న ఆర్జీవీ
తన తాజా చిత్రం 'వ్యూహం' విడుదల కు లైన్ క్లియర్ అయిందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ సినిమా విడుదలకు అడ్డంకులన్నీ తొలగిపోయాయని చెప్పారు. ఈ నెల 23న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతోందని తెలిపారు. ఒక అమ్మాయితో పార్టీ చేసుకుంటున్న ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 'హేయ్ నారా లోకేశ్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యూహం రిలీజ్ ను మేము సెలెబ్రేట్ చేసుకుంటున్నాం. ఫిబ్రవరి 23న సినిమా రిలీజ్ కాబోతోంది. టీడీపీని తాగేయడానికి, జనసేనను తినేయడానికి మేము వస్తున్నాం' అని ట్వీట్ చేశాడు. 

.
Advertisement
Ram Gopal Varma
Tollywood
Vyuham

More Telugu News