కేశినేని నానిపై బుద్ధా వెంకన్న ఉగ్ర నరసింహావతారం... వీడియో ఇదిగో!

TDP leader Budda Venkanna fires on Kesineni Nani
  • చంద్రబాబు భిక్షతో ఎదిగావు అంటూ కేశినేని నానిపై బుద్ధా ధ్వజం 
  • ఒరే కుక్కా... నువ్వు ఎవరివి? అంటూ తీవ్ర వ్యాఖ్యలు
  • నువ్వెంతరా నాకు... బచ్చావి అంటూ ఫైర్
ఇటీవల టీడీపీ నుంచి నిష్క్రమించి, వైసీపీకి దగ్గరైన విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు భిక్షతో ఎదిగావు... ఒరే కుక్కా నువ్వు ఎవరివి? అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. 

"నీ సోదరుడు కేశినేని చిన్ని ఉన్నాడు... అతను నీ తమ్ముడు కాబట్టి కొన్ని పరిమితులు ఉన్నాయి. కానీ నాకు అలాంటి పరిధులు ఏమీ లేవు. ఎందుకంటే... చంద్రబాబునాయుడు గారికి నేను రామభక్త హనుమాన్ లాంటివాడ్ని. రెండు నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయని నువ్వు వెళ్లిపోయావు... ఇవాళ ఇక్కడేమీ అధికార యంత్రాంగం లేదు... క్లోజయిపోయింది. మూడున్నరేళ్ల కిందటే పిచ్చికుక్క కొడాలి నాని గాడి అంతుచూసినవాడ్ని నేను. నువ్వెంతరా నాకు... నువ్వు నాకు బచ్చావి! 

నువ్వు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్నంత వరకే నువ్వేం మాట్లాడినా నిన్ను ఊరికే వదిలేశా. నువ్వేంది... నీమీద చంద్రబాబు గారు పోటీ చేయడం ఏంది? చంద్రబాబుగారి మీద నువ్వు 3 లక్షల మెజారిటీతో గెలుస్తావా? ఒరేయ్... నువ్వు గానీ, నీ కూతురు గానీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేయండి...  నేను పోటీ చేస్తా... మీరు 3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోవడం ఖాయం" అంటూ బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు.
Advertisement
Budda Venkanna
Kesineni Nani
TDP
YSRCP
Vijayawada

More Telugu News