న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో మెరిసిన మెగాస్టార్ చిరంజీవి.. వీడియో ఇదిగో!

Chiranjeevi visuals on New York Times Square screen
  • చిరంజీవిని వరించిన పద్మవిభూషణ్ పురస్కారం
  • టైమ్స్ స్క్వేర్ స్క్రీన్ పై చిరంజీవి విజువల్స్ ను ప్రదర్శించిన అభిమానులు
  • చిరంజీవికి అభినందనలు తెలియజేసిన ఫ్యాన్స్
తెలుగు సినీ పరిశ్రమను తన అద్భుత నటన, డ్యాన్సులు, స్పీడ్ తో మరో దశకు తీసుకెళ్లిన నట శిఖరం చిరంజీవి. టాలీవుడ్ చరిత్రను చిరంజీవికి ముందు, చిరంజీవికి తర్వాత అని రెండు భాగాలుగా చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినీ రంగానికి ఆయన చేసిన విశేషమైన సేవలకు గాను భారత ప్రభుత్వం రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ కు ఎంపిక చేసింది. 

చిరుకి పద్మవిభూషణ్ రావడంతో ఆయన అభిమానులు మురిసిపోతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న టైమ్స్ స్క్వేర్ స్క్రీన్ పై చిరంజీవి విజువల్స్ ను ఆయన అభిమానులు ప్రదర్శించారు. 'దేశ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ ను సాధించిన సందర్భంగా అభినందనలు మెగాస్టార్ చిరంజీవి గారు' అంటూ విజువల్స్ పై పేర్కొన్నారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Advertisement
Chiranjeevi
Tollywood
Padma Vibhushan
New York
Times Square
Viral Videos

More Telugu News