సంప్రదాయ దుస్తుల్లో అయోధ్య రామ మందిరానికి చేరుకున్న చంద్రబాబు, చిరంజీవి.. వీడియో ఇదిగో!

Chadrababu reached Ayodhya Ram temple
  • సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి వచ్చిన చంద్రబాబు
  • స్వాగతం పలికిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు
  • కాసేపట్లో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం
టీడీపీ అధినేత చంద్రబాబు అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయానికి చేరుకున్నారు. పంచె ధరించి, భుజాన కండువా కప్పుకుని ఆయన పూర్తిగా సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి వచ్చారు. ఆలయం వద్ద చంద్రబాబుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు స్వాగతం పలికారు. ఆయన సీటు వద్దకు తీసుకెళ్లి కూర్చో బెట్టారు. కాసేపట్లో మందిరంలోని బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ ఉదయం 10 గంటలకు చంద్రబాబు అయోధ్యకు చేరుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య, కుమారుడు రామ్ చరణ్ కూడా రామ మందిరానికి చేరుకున్నారు. పట్టు వస్తాలను ధరించి సంప్రదాయబద్ధంగా వీరు గుడికి చేరుకున్నారు. ఆలయంలోకి వెళ్తున్న సమయంలో వీరిని మీడియా చుట్టుముట్టింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
Ayodhya Ram Mandir

More Telugu News