నారావారిపల్లె చేరుకున్న చంద్రబాబు, లోకేశ్... ఘనస్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు

Chandrababu and Nara Lokesh arrives Naravaripalle
  • ఈ ఉదయం పవన్ తో కలిసి భోగిమంటలు కార్యక్రమంలో పాల్గొన్న బాబు
  • అనంతరం లోకేశ్ తో కలిసి స్వగ్రామం పయనం
  • నారావారిపల్లెలో గ్రామదేవతకు పూజలు చేయనున్న టీడీపీ అధినేత
సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తమ స్వగ్రామం నారావారిపల్లె చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేశ్ లకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. 

నారా, నందమూరి కుటుంబ సభ్యులు ఇంతకుముందే నారావారిపల్లె చేరుకున్నారు. చంద్రబాబు, లోకేశ్ నిన్న ఉండవల్లిలో పవన్ కల్యాణ్ తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ ఉదయం చంద్రబాబు, పవన్ భోగిమంటలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం చంద్రబాబు, లోకేశ్ హెలికాప్టర్ లో స్వగ్రామం నారావారిపల్లె బయల్దేరారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొననున్నారు. గ్రామదేవతకు ప్రత్యేక పూజలు చేయనున్నారు.



Go Back to Shorts
Chandrababu
Nara Lokesh
Naravaripalle

More Telugu News