స్వీట్... సూపర్ స్వీట్... మెగా కోడళ్ల మధ్య ఆసక్తికర సంభాషణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్వీట్... సూపర్ స్వీట్... మెగా కోడళ్ల మధ్య ఆసక్తికర సంభాషణ

Upasana and Lavanya Tripathi praises each other
  • బెంగళూరులో మెగా, అల్లు కుటుంబ సభ్యుల సంక్రాంతి వేడుకలు
  • కొత్త కోడలు సున్నుండలు చేస్తోందన్న ఉపాసన
  • పెద్ద కోడలు సూపర్ స్వీట్ అంటూ బదులిచ్చిన లావణ్య త్రిపాఠి
సంక్రాంతి సంబరాల కోసం మెగా, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు చేరుకున్నారు. ఈ వేడుకల కోసం బెంగళూరులోని ఫాంహౌస్ అందంగా ముస్తాబైంది. రామ్ చరణ్-ఉపాసన దంపతులు క్లీంకార రాకతో తల్లిదండ్రులు కావడం... వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లితో ఓ ఇంటివారవడం... ఈసారి మెగా కుటుంబంలో ఈ సంక్రాంతికి కొత్త శోభను తీసుకువచ్చాయి. 

ఈ నేపథ్యంలో, మెగా కోడళ్లు ఉపాసన, లావణ్య త్రిపాఠి మధ్య ఇన్ స్టా స్టోరీస్ లో ఆసక్తికర పోస్టులు నడిచాయి. "కొత్త కోడలు మా అందరికీ సున్నుండలు చేస్తోంది... ఆమె ఎంతో స్వీట్" అంటూ లావణ్య త్రిపాఠీని ఉద్దేశించి ఉపాసన పోస్ట్ చేయగా.... "థాంక్యూ... సూపర్ స్వీట్  పెద్ద కోడలు" అంటూ లావణ్య త్రిపాఠి బదులిచ్చారు. 

రామ్ చరణ్, ఉపాసన ఇవాళ హైదరాబాద్ నుంచి బెంగళూరు తరలి వెళ్లడం తెలిసిందే. ఇతర మెగా ఫ్యామిలీ మెంబర్స్, అల్లు కుటుంబ సభ్యులు కూడా బెంగళూరు చేరుకున్నట్టు తెలుస్తోంది.
Advertisement
Upasana
Lavanya Tripathi
Mega Family
Sankranti
Bengaluru

More Telugu News