పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ.. ప్రజాభవన్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన
Advertisement

పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ.. ప్రజాభవన్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన

Workers protest at Praja Bhavan
  • ప్రతి నెల ఐదో తేదీ లోపు బిల్లులు, వేతనాలు చెల్లించాలని డిమాండ్
  • పెంచిన రూ.3వేలను వెంటనే అమలు చేయాలన్న మధ్యాహ్న భోజన కార్మికులు
  • జీవో 46ను రద్దు చేయాలంటూ నిరుద్యోగుల నిరసన 
తెలంగాణాలోని వివిధ జిల్లాలకు చెందిన మధ్యాహ్న భోజన కార్మికులు శుక్రవారం ప్రజాభవన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడ నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. అధికారులు వారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అదే సమయంలో మధ్యాహ్న భోజన కార్మికులు అక్కడే నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

ప్రతి నెల పదో తేదీ లోపే మెస్ బిల్లులు, వేతనాల చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తమకు రూ.3వేల వేతనం పెంచారని... దీనిని వెంటనే అమలు చేయాలన్నారు. మరోవైపు జీవో 46ను వెంటనే రద్దు చేయాలని నిరుద్యోగులు ప్రజాభవన్ వద్ద నిరసన తెలిపారు. రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు.
Advertisement
praja bhavan
Congress
Telangana

More Telugu News