గత ప్రభుత్వం ప్రజలను ట్రాఫిక్ ఇబ్బందుల్లోకి నెట్టింది: ఫార్ములా రేస్‌పై కాంగ్రెస్ నేత నిరంజన్
- ఫార్ములా రేస్ కారణంగా భాగ్యనగరవాసులు గతంలో ఇబ్బందిపడ్డారని వ్యాఖ్య
- ఇప్పుడు ఫార్ములా రేస్‌కు అనుమతి ఇవ్వకపోవడంపై హర్షం వ్యక్తం చేసిన నిరంజన్
- ఫార్ములా రేస్‌కు అనుమతి ఇవ్వకపోవడాన్ని కాంగ్రెస్ స్వాగతిస్తోందని వెల్లడి
ట్రాఫిక్‌ను స్తంభింపచేసి గత ప్రభుత్వం అవివేక నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ప్రజలు ట్రాఫిక్‌లో చిక్కుకొని అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. ఈ రేస్ వల్ల ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం లేదన్నారు. ఫార్ములా రేస్ వల్ల పెట్టుబడులు వస్తాయని కేటీఆర్ చెప్పడం తెలివి తక్కువతనమన్నారు. ఫార్ములా రేస్‌లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని తెలిపారు.