రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న 'హాయ్ నాన్న'
- నాని హీరోగా చేసిన 'హాయ్ నాన్న'
- ఎమోషన్స్ ప్రధానంగా నడిచే కథ
- డిసెంబర్ 7న థియేటర్స్ కి వచ్చిన సినిమా
- ఈ నెల 4 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు కొన్ని కారణాల వలన ఓ భార్య దూరమైపోతుంది. ఆ తరువాత జరిగిన ఒక ప్రమాదం కారణంగా గతాన్ని మరిచిపోయిన ఆమె, తనకి తెలియకుండానే తిరిగి భర్త జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ కథలో ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా పలకరించడానికి రెడీ అవుతోంది.
ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'నెట్ ఫ్లిక్స్' వారు దక్కించుకున్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా చెబుతూ, ఒక పోస్టర్ ను వదిలారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి మరింత రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.