నేను రాజీనామా చేయడం లేదు... పోటీ కూడా చేయడం లేదు: గవర్నర్ తమిళిసై
- లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తాననే ప్రచారంలో నిజం లేదన్న తమిళిసై
- ఎంపీగా పోటీ చేస్తానని ఎవరికీ విజ్ఞప్తి చేయలేదని స్పష్టీకరణ
- వరదల ప్రభావం నేపథ్యంలో తూత్తుకుడికి వెళ్లివచ్చానన్న గవర్నర్
తాను అసలు ఢిల్లీ వెళ్లలేదని... పోటీ చేస్తానని ఎవరినీ ఆడగలేదన్నారు. వరదల ప్రభావం వల్ల తాను కేవలం తూత్తుకుడికి మాత్రమే వెళ్లివచ్చానని వెల్లడించారు. తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని తెలిపారు. తాను ఎప్పుడూ ప్రజలతోనే ఉంటున్నట్లు తెలిపారు. శ్రీరాముల వారి దయతో... ప్రధాని నరేంద్ర మోదీ దయతో తాను విధులను నిర్వహిస్తున్నానన్నారు. అధిష్ఠానం తనకు ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తానన్నారు.