నీకు దండంరా బాబూ.. నువ్వే బ్యాటింగ్ చెయ్!.. బాబర్ ఆజంతో స్టీవ్ స్మిత్.. వీడియో ఇదిగో!
- రెండో టెస్టులో పాకిస్థాన్‌పై 79 పరుగుల తేడాతో ఆసీస్ విజయం
- ముందు బ్యాటింగ్ చెయ్ అంటూ బాబర్‌పై స్మిత్ సెటైర్
- బ్యాట్ చేతికి అందించి నువ్వే చెయ్ అన్న బాబర్
అదే సమయంలో వెనక కీపర్ పక్కనే నిల్చున్న స్మిత్.. సర్దుకోవడం తర్వాత ముందు బ్యాటింగ్ చెయ్.. అన్న అర్థంలో బాబర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. బాబర్ క్షణకాలం కూడా ఆలస్యం చేయకుండానే స్పందించాడు. చేతిలోని బ్యాట్‌ను స్మిత్‌కు అందిస్తూ..‘నువ్వు బ్యాటింగ్ చెయ్’ అని కౌంటర్ ఇచ్చాడు. బదులుగా స్మిత్ రెండుచేతులు జోడించి దండంపెడుతూ ‘నువ్వే చేసుకో’ అన్నట్టు ముఖం పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.