జహీరాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వండి: కిషన్ రెడ్డిని కోరిన బిజినెస్ మేన్ సురేశ్ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జహీరాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వండి: కిషన్ రెడ్డిని కోరిన బిజినెస్ మేన్ సురేశ్ రెడ్డి

Yeleti Kishan Reddy meets Kishan Reddy
  • కిషన్ రెడ్డిని కలిసిన వ్యాపారవేత్త ఏలేటి సురేశ్ రెడ్డి
  • ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని విన్నపం
  • త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్న కిషన్ రెడ్డి
యావత్ దేశం పార్లమెంట్ ఎన్నికల దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించాయి. మరోవైపు జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రముఖ పారిశ్రామికవేత్త ఏలేటి సురేశ్ రెడ్డి తెలిపారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. జహీరాబాద్ నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. త్వరలోనే ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చినట్టు సురేశ్ రెడ్డి తెలిపారు. బీజేపీ తనకు అవకాశం ఇస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
Advertisement
Yeleti Suresh Reddy
Kishan Reddy
BJP

More Telugu News