Anganwadi: కొండముచ్చుకు వినతిపత్రం అందజేసిన ఏపీ అంగన్వాడీలు... వీడియో ఇదిగో!

Anganwadis handed over their demands to a Baboon
  • డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్న ఏపీ అంగన్వాడీలు
  • గత రెండు వారాలుగా సమ్మె
  • ఆసక్తికర వీడియో పంచుకున్న తెలుగుదేశం పార్టీ
తమ డిమాండ్ల సాధన కోసం ఏపీలో అంగన్వాడీలు గత రెండు వారాలుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవడంలేదంటూ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయ సిబ్బంది ఓ కొండముచ్చు కోతికి వినతిపత్రం సమర్పించారు. 

సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమ్మె కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ఓ కొండముచ్చుకు వినతిపత్రం అందించారు. ఓ అంగన్వాడీ నేత ఇచ్చిన వినతిపత్రాన్ని ఆ కొండముచ్చు అందుకోవడంతో అందరూ చప్పట్లు కొట్టారు. 

దీనికి సంబంధించిన వీడియోను తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. జగన్ ఎలాగూ పట్టించుకోవడంలేదని, అంగన్వాడీలు కొండముచ్చుకు వినతిపత్రం అందజేశారని పేర్కొంది.
Anganwadi
Baboon
Monkey
Strike
Video
Andhra Pradesh

More Telugu News