ప్రతి దానిపై ఏడవడం మీకొక రోగం: అంబటిపై అమర్ నాథ్ రెడ్డి మండిపాటు

Amarnath Reddy fires on Ambati Rambabu
టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో యాగం, హోమం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ' నేడు యజ్ఞాలు ప్రజలకోసమంటావు! నాడు వెన్నుపోటు ప్రజల కోసమే అన్నావు. అలా అనడానికి కాస్తంత సిగ్గుండాలి' అని ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. చంద్రబాబు యాగం చేస్తే నీకేంటి రోగమని ప్రశ్నించారు. రాష్ట్రం కోసం చంద్రబాబు చేసే యజ్ఞాన్ని భగ్నం చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు బూడిద చేయడం ఖాయమని అన్నారు. మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ... ప్రతి దానిపై ఏడవడం మీకొక రోగమని మండిపడ్డారు. త్వరలోనే రాష్ట్రానికి మంచి యోగం పట్టబోతోందని అన్నారు.
Go Back to Shorts
Amarnath Reddy
jawahar
Telugudesam
Ambati Rambabu
YSRCP

More Telugu News