మంత్రి అంబటి వ్యాఖ్యలకు బొండా ఉమ కౌంటర్
- లోకేశ్ తో కలిసి హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన ప్రశాంత్ కిశోర్
- ఉండవల్లిలో చంద్రబాబుతో సమావేశం
- మెటీరియలే మంచిది కాకపోతే మేస్త్రి ఏమి చేస్తాడంటూ అంబటి సెటైర్
- మీ పని అయిపోయింది కాబట్టే గెలిచే టీడీపీని కలిశాడంటూ బొండా ఉమ రిప్లయ్
కాగా, లోకేశ్ తో కలిసి ప్రశాంత్ కిశోర్ ఏపీకి రావడంపై మంత్రి అంబటి రాంబాబు వ్యంగ్యం ప్రదర్శించడం తెలిసిందే. మెటీరియలే మంచిది కాకపోతే మేస్త్రి ఏమి చేయగలడని సెటైర్ వేశారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత బొండా ఉమ స్పందించారు. "బాగా చెప్పావు అంబటి... వైసీపీ పని, మీ జగన్ పని అయిపోయింది కాబట్టే గెలిచే టీడీపీని కలిశాడు" అంటూ ట్వీట్ చేశారు.