లోకేశ్, ప్రశాంత్ కిశోర్ కలిసి ఏపీకి రావడంపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్
- హైదరాబాద్ నుంచి ఒకే విమానంలో విజయవాడకు లోకేశ్, ప్రశాంత్ కిశోర్
- ఒకే వాహనంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పయనం
- చంద్రబాబుతో సమావేశమైన ప్రశాంత్ కిశోర్
- మెటీరియలే మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేయగలడంటూ అంబటి వ్యంగ్యం
మెటీరియలే మంచిది కాకపోతే మేస్త్రి ఏమి చేయగలడు? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఆ పీకే (పవన్ కల్యాణ్) వచ్చినా, ఈ పీకే (ప్రశాంత్ కిశోర్) వచ్చినా ఏపీలో టీడీపీని గెలిపించడం కష్టమని అభిప్రాయపడ్డారు. టీడీపీ ఇప్పటికే చచ్చిన పార్టీ అని, ప్రశాంత్ కిశోర్ వచ్చి ఏమైనా పోస్టుమార్టం చేయగలరేమో కానీ... టీడీపీ గెలవడం అసాధ్యం అని వ్యాఖ్యానించారు.