హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన లోకేశ్, ప్రశాంత్ కిశోర్... కాసేపట్లో చంద్రబాబుతో భేటీ!
- ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం
- ఒకే వాహనంలో గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి వెళ్లిన లోకేశ్, ప్రశాంత్ కిశోర్
- గత ఎన్నికల్లో వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్
రాబోయే ఎన్నికల కోసం ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ టీడీపీ అధినాయకత్వంతో భేటీ అవుతుండడం ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడం కోసమేనని తెలుస్తోంది. ఇందుకోసం టీడీపీ... ప్రశాంత్ కిశోర్ తో ఏదైనా ఒప్పందం కుదుర్చుకుంటుందా? అన్నది వేచిచూడాలి.