జేఎన్1 వేరియంట్ ను తక్కువగా అంచనా వేయొద్దంటున్న డబ్ల్యూహెచ్ఓ మాజీ చీఫ్ సైంటిస్ట్
- భారత్ లో మళ్లీ కరోనా కలకలం
- కొత్త వేరియంట్ ను జేఎన్1 గా గుర్తించిన కేంద్రం
- నిత్యం వందల సంఖ్యలో కొత్త కేసులు
- ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
2. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ తో బాధపడిన వారి సమాచారం ఇప్పుడు మన వద్ద ఉంది. గుండె సంబంధ సమస్యలతో బాధపడేవారు, స్ట్రోక్ బాధితులు, మధుమేహం, మతిమరుపు, మానసిక కుంగుబాటు, మానసిక సమస్యలు, దీర్ఘకాలిక అలసట, కండరాల నొప్పులతో బాధపడేవారు ఒక్కసారి కొవిడ్ బారినపడితే తిరిగి మామూలు ఆరోగ్యాన్ని సంతరించుకోవడం వారి శక్తికి మించిన పని అవుతుంది.
3. అందుకే కొవిడ్ పట్ల ఏ మాత్రం ఉదాసీనతకు చోటివ్వకూడదు. ఇప్పటికీ ఆ వైరస్ మహమ్మారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. అయితే భయాందోళనలకు గురవ్వాల్సిన అవసరం లేదు.
4. ఇప్పుడు వ్యాపిస్తున్న కొత్త వేరియంట్ ను ఎదుర్కోవడానికి మనకందరికీ తెలిసిన ముందు జాగ్రత్త చర్యలు సరిపోతాయి. జేఎన్1 కూడా ఒమిక్రాన్ కుటుంబానికి చెందినదే. ఒమిక్రాన్ ఒకట్రెండు ఉత్పరివర్తనాలకు లోనై జేఎన్1 ఏర్పడి ఉంటుంది. అందుకే దీనిపై ఓ కన్నేసి ఉంచాలని డబ్ల్యూహెచ్ఓ కూడా చెబుతోంది.
5. గాలి సరిగా ప్రసరించని గదుల్లో ఉండరాదు. ముఖ్యంగా, మాస్క్ లేకుండా ఉన్న వ్యక్తులతో కలిసి ఎక్కువ సమయం గడపొద్దు. ఇతరులతో కలిసి ఓ గదిలో ఉండాల్సినప్పుడు మాస్క్ ధరించాలి.