హైదరాబాదులో పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు
- ఏపీలో టీడీపీ-జనసేన మధ్య పొత్తు
- ఉమ్మడి మేనిఫెస్టో కోసం కసరత్తులు
- ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు ఇంటికి వెళ్లిన పవన్
- తొలిసారిగా పవన్ నివాసానికి వచ్చిన చంద్రబాబు
బహుశా, పొత్తు నేపథ్యంలో ఉమ్మడి కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నారా లోకేశ్ యువగళం ముగింపు సభకు చంద్రబాబుతో పాటు పవన్ కూడా వస్తారని ప్రచారం జరిగినా... ఉమ్మడి మేనిఫెస్టో ఇంకా సిద్ధం కాకపోవడంతో పవన్ కల్యాణ్ రావడంలేదని ప్రకటన వెలువడింది. ఈ అంశం కూడా చంద్రబాబు, పవన్ ల మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది.

