Advertisement

లోక్ సభ స్పీకర్‌కు రాజీనామాను సమర్పించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy resigns as Lok Sabha MP
  • ఢిల్లీ పర్యటనలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • తొలుత భార్యతో కలిసి సోనియా, రాహుల్ గాంధీని కలిసిన ఉత్తమ్ 
  • ఓంబిర్లాకు రాజీనామాను సమర్పించినట్లు ట్వీట్ చేసిన మంత్రి  
తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన లోక్ సభ సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తాను రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. తొలుత తన భార్య పద్మావతిరెడ్డితో కలిసి ఢిల్లీ జన్‌పథ్‌లో ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిశారు. అక్కడి నుంచి పార్లమెంటుకు వెళ్లారు. అక్కడ స్పీకర్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.

'నేను పార్లమెంటుకు వెళ్లి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు రాజీనామాను సమర్పించాను' అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్వీట్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2019 లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ లోక్ సభ స్థానం నుంచి గెలుపొందారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి గెలిచి, రేవంత్ రెడ్డి కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామాను సమర్పించారు.
Advertisement
Uttam Kumar Reddy
Telangana
Congress
Lok Sabha Speaker

More Telugu News