'ఆహా' తెరపైకి 'రాక్షస కావ్యం'
- అక్టోబర్ 13న విడుదలైన 'రాక్షస కావ్యం'
- నూతన నటీనటులతో తీసిన సినిమా
- ఈ నెల 15 నుంచి స్ట్రీమింగ్
- Imdb నుంచి మంచి రేటింగ్
ఇప్పుడు ఈ సినిమాను 'ఆహా' తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ సినిమా 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ, అధికారిక పోస్టర్ ను వదిలారు కూడా. దాదాపుగా నూతన నటీనటులతో రూపొందించిన సినిమా ఇది. శ్రీమాన్ కీర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, రాజీవ్ రాజ్ - శ్రీకాంత్ నిర్మాతలుగా ఉన్నారు.
అజయ్ - విజయ్ అనే రెండు ప్రధానమైన పాత్రల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు మంచి మనుషులను ఎలా మారుస్తాయి? అలా మారితే పరిణామాలు ఎలా ఉంటాయి? అనే ఒక అంశం నేపథ్యంలో కథ నడుస్తుంది. Imdb నుంచి మంచి రేటింగ్ దక్కించుకున్న ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందనేది చూడాలి.
