పొటాటో అంటే ఉల్లిగడ్డనే కదా? అంటూ అడిగిన సీఎం జగన్
- తిరుపతి జిల్లా బాలిరెడ్డిపల్లెలో వరద బాధితులతో జగన్ సమావేశం
- 60వేల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నామంటూ ఇచ్చే ఆహారపదార్థాలను చెప్పిన జగన్
- ఆలుగడ్డకు బదులు ఉల్లిగడ్డ అన్న సీఎం
జగన్ మాట్లాడుతూ... తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 92 రిలీఫ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, 8 వేలకు పైగా బాధితులను అక్కడకు తరలించామన్నారు. దాదాపు 60వేల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నామని, 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్, కిలో ఆనియన్, బంగాళాదుంపలు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో పొటాటోను ఉల్లిగడ్డ అనే అంటారు కదా? అని పక్కనున్న వారిని అడిగారు. పొటాటో అంటే ఆలుగడ్డ.... కానీ ఆయన ఉల్లిగడ్డ అంటారు కదా.. అని ప్రశ్నించారు. పక్కనున్న వారు బంగాళాదుంప అని చెప్పగా.. ఆ తర్వాత నవ్వుకుంటూ, 'ఆ.. బంగాళాదుంప' అన్నారు.