నోట్ల కట్టలతో పట్టుబడ్డ ఎక్సైజ్ సీఐపై వేటు
- సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వుల జారీ
- వరంగల్ నుంచి డబ్బు తరలించిన సీఐ
- చెంగిచెర్ల వద్ద పట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
ఈ నెల 27 సోమవారం నాడు ఎక్సైజ్ సీఐ అంజిత్ రావు దాదాపు 6 లక్షలకు పైగా సొమ్ముతో వరంగల్ నుంచి కారులో బయలుదేరాడు. మేడ్చల్ కు వెళుతుండగా చెంగిచెర్ల సమీపంలో ఆయన కారును కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. కారులో తనిఖీ చేయగా ఓ సంచీలో నోట్లకట్టలు బయటపడ్డాయి. అందులో అంజిత్ రావు ఐడీ కార్డు కూడా ఉంది. దీంతో సీఐ అంజిత్ ను కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు. పోలీసులు అంజిత్ కారును, నోట్ల కట్టలను సీజ్ చేశారు.