మాజీ ఎంపీ వివేక్, ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలపై ఈడీ ప్రకటన
- విశాఖ ఇండస్ట్రీస్, ఎంఎస్ సెక్యూరిటీస్ మధ్య రూ.100 కోట్ల లావాదేవీలు గుర్తించినట్లు వెల్లడి
- వ్యాపారం ద్వారా రూ.20 లక్షల ఆదాయం వచ్చిందని, ఆస్తులు, అప్పులతో రూ.64 కోట్ల బ్యాలెన్స్ షీట్ ఉందన్న ఈడీ
- ఎంఎస్ సెక్యూరిటీస్‌కు యశ్వంత్ రియాల్టర్స్ మాతృసంస్థగా గుర్తించామన్న ఈడీ
లావాదేవీలు మాత్రం రూ.200 కోట్లకు పైగా గుర్తించినట్లు పేర్కొంది. కంపెనీలను వివేక్ పరోక్షంగా నియంత్రిస్తున్నారని, ఎంఎస్ సెక్యూరిటీ సంస్థ ఫెమా నిబంధనలను ఉల్లంఘించిందని తెలిపింది. మరోవైపు ఎంఎస్ సెక్యూరిటీస్ సంస్థకు యశ్వంత్ రియాల్టర్స్ మాతృ సంస్థ అని, ఇందులో విదేశీ షేర్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని ఈడీ తెలిపింది. వివేక్ ఫెమా నిబంధనలకు ఉల్లంఘించి విదేశంలో సంస్థను ఏర్పాటు చేశారన్నారు.