"చెల్లెమ్మా పురందేశ్వరీ"... అంటూ మరోసారి టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి
- పురందేశ్వరిపై విమర్శల పర్వాన్ని కొనసాగిస్తున్న విజయసాయి
- మీ మరిదికి శిక్ష పడకుండా మీరు చేస్తున్న పనేంటి అంటూ పురందేశ్వరిపై ఫైర్
- భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడా? అంటూ ట్వీట్
తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి పురందేశ్వరిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో స్పందించారు. చెల్లెమ్మా పురందేశ్వరీ... జిల్లాకు మీ నాన్న పేరు పెట్టిన జగన్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకుని, మీ నాన్నను వెన్నుపోటు పొడిచిన మీ మరిదికి శిక్ష పడకుండా మీరు చేస్తున్న పనిని ఏమంటారో దయచేసి చెప్పగలరా? అంటూ నిలదీశారు. భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడా? అని ప్రశ్నించారు.