'మంగళవారం'పై క్రేజ్ గట్టిగానే కనిపిస్తుందే!
- విలేజ్ నేపథ్యంలో సాగే 'మంగళవారం'
- హాట్ లుక్స్ తో ఆకట్టుకోనున్న పాయల్
- ఆమె కెరియర్ కి కలిసొచ్చే రోల్
- ఈ నెల 17వ తేదీన సినిమా రిలీజ్
'RX 100' సినిమాలో పాయల్ గ్లామర్ ను అజయ్ భూపతి ఒక రేంజ్ లో చూపించాడు. ఈ సినిమాలోనూ పాయల్ ను ఆయన హాట్ గానే చూపించనున్నాడు. కోరికలను అదుపుచేసుకోలేని పాత్రలో ఆమె ఈ సినిమాలో కనిపించనుండటం ఆసక్తిని రేకెత్తించే అంశంగా మారింది.
గ్రామీణ నేపథ్యంలోని మూఢనమ్మకాలు .. ప్రతి మంగళవారం ఎవరో ఒకరు అనుమానాస్పదంగా చనిపోవడం .. అక్కడి రాజకీయాలు .. చాటుమాటు శృంగారాలు ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఈ సినిమా పాయల్ కెరియర్ కి మరింత ఊతాన్ని ఇవ్వడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.