విజయ్ దేవరకొండ 'లైగర్'లో నటించడం నా జీవితంలో అతి పెద్ద తప్పు: అనన్య పాండే
- అట్టర్ ఫ్లాప్ అయిన 'లైగర్'
- అనన్య కెరీర్ పై తీవ్ర ప్రభావం
- అమ్మ, నాన్న బలవంతంతోనే ఈ సినిమాలో నటించానని వ్యాఖ్య
ఈ నేపథ్యంలో తాజాగా ఆమె స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమాలో తాను నటించడం తన జీవితంలోనే అతి పెద్ద తప్పిదమని ఆమె వ్యాఖ్యానించింది. తన తండ్రి చుంకీపాండే, తల్లి భావన, నిర్మాత కరణ్ జొహార్ బలవంతంతోనే తాను ఈ చిత్రంలో నటించానని చెప్పింది. ఈ సినిమాకు వచ్చినంత చెత్త రివ్యూ నా జీవితంలో ఏ సినిమాకు రాలేదని తెలిపింది. ఈ సినిమాకు కరణ్ జొహార్ ఒక సమర్పకుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.