ఇసుక కేసు.. పాస్ ఓవర్ అడిగిన చంద్రబాబు న్యాయవాదులు
- ఇసుకను ఉచితంగా ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి రూ. 1,300 కోట్ల నష్టం జరిగిందన్న సీఐడీ
- ఇసుక పాలసీపై కేబినెట్ లో చర్చించలేదని ఎఫ్ఐఆర్
- ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన చంద్రబాబు
ఈ నేపథ్యంలో, ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే, విచారణ సందర్భంగా చంద్రబాబు తరపు లాయర్లు వాదనలకు కొంత సమయాన్ని (పాస్ ఓవర్) కోరారు. దీంతో, మధ్యాహ్నం పిటిషన్ ను విచారిస్తామని హైకోర్టు తెలిపింది. మరోవైపు, విధానపరమైన నిర్ణయాలకు నేరాలను ఆపాదిస్తున్నారని పిటిషన్ లో చంద్రబాబు పేర్కొన్నారు. 17ఏ ప్రకారం కేసు నమోదుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తప్పనిసరి అని చెప్పారు.