ప్రముఖ సినీ నటుడు ఈశ్వర్ రావు కన్నుమూత.. ఆలస్యంగా వెలుగు చూసిన మృతి వార్త

Tollywood actor Eshwar Rao passes away
  • అమెరికాలో ఉన్న కూతురు వద్దకు వెళ్లిన ఈశ్వర్ రావు
  • అక్టోబర్ 31న మృతి
  • 'స్వర్గం నరకం' సినిమా ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైన ఈశ్వర్ రావు
టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు ఈశ్వర్ రావు కన్నుమూశారు. అక్టోబర్ 31న ఆయన మృతి చెందారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈశ్వర్ రావు కుమార్తె అమెరికాలోని మిషిగాన్ లో ఉంటున్నారు. కూతురు వద్దకు వెళ్లిన ఈశ్వర్ రావు అక్కడే కన్నుమూశారు. ఆయన మరణవార్తతో తెలుగు సినీ పరిశ్రమ దిగ్భాంతికి గురయింది. సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. 

'స్వర్గం నరకం' సినిమా ద్వారా సినీ పరిశ్రమకు ఈశ్వర్ రావు పరిచయం అయ్యారు. ఇదే సినిమాతోనే మోహన్ బాబు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తొలి సినిమాతోనే ఆయన నంది (కాంస్య) అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తన కెరీర్లో దాదాపు  200కు పైగా చిత్రాల్లో నటించారు. పలు టీవీ సీరియళ్లలో కూడా నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
Advertisement
Eshwar Rao
Tollywood

More Telugu News