సంబరాలతో హోరెత్తిస్తున్న టీడీపీ శ్రేణులు.. ట్రెండ్ అవుతున్న ‘నిజం గెలిచింది’ హ్యాష్‌ట్యాగ్

సంబరాలతో హోరెత్తిస్తున్న టీడీపీ శ్రేణులు.. ట్రెండ్ అవుతున్న ‘నిజం గెలిచింది’ హ్యాష్‌ట్యాగ్

TDP Followers Celebrates Chandrababu Bail
  • బాణసంచా కాలుస్తూ.. మిఠాయిలు పంచుకుంటూ టీడీపీ శ్రేణుల సంబరాలు
  • వైరల్ అవుతున్న వీడియోలు
  • వచ్చే నెల 28 వరకు చంద్రబాబుకు బెయిలు మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి 52 రోజులపాటు జైలులో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మిఠాయిలు పంచుకుంటూ, బాణసంచా పేలుస్తూ కార్యకర్తలు, నాయకులు సంతోషంలో మునిగిపోయారు. రాజమండ్రి, హిందూపురం సహా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అభిమానులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి సంతోషాన్ని పంచుకుంటున్నారు. టపాసులు కాలుస్తూ హోరెత్తిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘బాబు ఈజ్ బ్యాక్’, ‘నిజం గెలిచింది’ వంటి హ్యాష్‌టాగ్‌లను జత చేస్తున్నారు. ఇప్పుడివి ట్రెండ్ అవుతున్నాయి.

చంద్రబాబునాయుడు ఆరోగ్య కారణాల నేపథ్యంలో పెట్టుకున్న పిటిషన్‌కు ఆమోదం తెలిపిన న్యాయస్థానం ఆయనకు నాలుగు వారాల బెయిలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 28వ తేదీ వరకు ఆయన బెయిలుపై వుంటారు. ఆరోజు సాయంత్రం 5 గంటల్లోపు సరెండర్ కావాలని కోర్టు ఆదేశించింది.  కాగా, ప్రధాన బెయిలు పిటిషన్ వచ్చే నెల 10న విచారణకు రానుంది.
Advertisement
Chandrababu Bail
Skill Development Case
NijamGelichindi
BabuIsBack

More Telugu News