Shankardada MBBS: చిరంజీవి 'శంకర్ దాదా ఎంబీబీఎస్' రీ రిలీజ్ ట్రైలర్ ఇదిగో!

Shankar Dada MBBS re release trailer out now
షార్ట్స్‌లో చూడండి
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయే సినిమా 'శంకర్ దాదా ఎంబీబీఎస్'. 2004లో చిరంజీవి, దర్శకుడు జయంత్ సి పరాన్జీ కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపింది. సోనాలీ బెంద్రే, శ్రీకాంత్, పరేష్ రావల్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తున్నారు. 'శంకర్ దాదా ఎంబీబీఎస్' చిత్రం నవంబరు 4న రీ రిలీజ్ అవుతోంది. తాజాగా, ఈ చిత్రం నుంచి ఓ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 2.08 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో దాదాపు సినిమాను చూపించేశారు. ఓ పాటలో పవన్ కల్యాణ్ కూడా తళుక్కుమనడం ఈ ట్రైలర్ లో చూడొచ్చు.
Go Back to Shorts
Shankardada MBBS
Trailer
Chiranjeevi
Tollywood

More Telugu News