Raghavendra Rao: ప్రజల ఆగ్రహ జ్వాలలు వైసీపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో దహించి వేస్తాయి: రాఘవేంద్రరావు, అశ్వనీ దత్

Raghavendra Rao and Ashwini Dutt fires on YSRCP
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడంపై ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వనీదత్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ అరెస్ట్ అక్రమమని వారు అన్నారు. నారా భువనేశ్వరి చేపట్టిన 'నిజం గెలవాలి' యాత్రకు వారు సంఘీభావం ప్రకటించారు. తమ సోదరి భువనేశ్వరి చేపట్టిన యాత్రకు వస్తున్న భారీ స్పందనను చూస్తుంటే... నిజంగానే నిజం గెలుస్తుందని అనిపిస్తోందని చెప్పారు. నిజం గెలిచి, ప్రజలు విజయభేరి మోగించే సమయం దగ్గర్లోనే ఉందని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ పై ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోందని... ప్రజల ఆగ్రహ జ్వాలలు వైసీపీ ప్రభుత్వాన్ని దహించి వేస్తాయని చెప్పారు. భువనేశ్వరి యాత్ర రేపటి చంద్రబాబు ఘన విజయానికి హృదయపూర్వక ఆహ్వానం అని అన్నారు.
Go Back to Shorts
Raghavendra Rao
Ashwini Dutt
Tollywood
Chandrababu
Nara Bhuvaneswari
Telugudesam
YSRCP

More Telugu News