ఈ నెల 25 నుంచి 'నిజం గెలవాలి' పేరిట నారా భువనేశ్వరి యాత్ర చేస్తారు: లోకేశ్

Nara Bhuvaneswari set to go into people from Oct 25
  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ 
  • ఆవేదనతో మరణించిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తారన్న లోకేశ్
  • చంద్రగిరి నియోజకవర్గం నుంచి యాత్ర ప్రారంభమవుతుందని వెల్లడి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి ఇప్పటిదాకా ప్రజల్లోకి వెళ్లింది లేదు. కానీ, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టయ్యాక ఆమె బయటికి రావాల్సి వస్తోంది. ఈ క్రమంలో, ఆమె ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. 

'నిజం గెలవాలి' పేరుతో నారా భువనేశ్వరి ఈ నెల 25 నుంచి రాష్ట్రంలో యాత్ర చేపడతారని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యాక ఆవేదనతో మరణించినవారిని ఆమె పరామర్శిస్తారని వివరించారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి భువనేశ్వరి యాత్ర ప్రారంభిస్తారని లోకేశ్ వెల్లడించారు. యాత్ర ప్రారంభానికి ముందు భువనేశ్వరి ఈ నెల 24న తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని తెలిపారు. తిరుమల నుంచి అదే రోజున బయల్దేరి నారావారిపల్లెకు వెళతారని లోకేశ్ చెప్పారు.
Go Back to Shorts
Nara Bhuvaneswari
Nijam Gelavali
Chandrababu
Arrest
Nara Lokesh
TDP

More Telugu News