టీడీపీ, జనసేన మహాధర్నా.. తీవ్ర ఉద్రిక్తత
- అవనిగడ్డలో మహా ధర్నాకు పిలుపునిచ్చిన టీడీపీ, జనసేన
- నియోజకవర్గ అభివృద్ధికి జగన్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ధర్నా
- ఇరు పార్టీల నేతలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
టీడీపీ నేత మండలి బుద్ధ ప్రసాద్ తో పాటు టీడీపీ, జనసేన నేతలకు నిన్ననే నోటీసులు ఇచ్చారు. బుద్ధ ప్రసాద్ సహా ఇతర నేతలను వారి ఇళ్ల వద్దే నిర్బంధించారు. ఎమ్మెల్యే ఇంటికి వెళ్లే అన్ని దారుల్లో పికెట్లు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఏడాది క్రితం అవనిగడ్డకు వచ్చినప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి రూ. 93 కోట్ల వరాలు కురిపించారని... ఆ హామీలను ఎప్పుడు నెరవేరుస్తారంటూ టీడీపీ, జనసేనలు ధర్నాకు పిలుపునిచ్చాయి.