చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను వెకేషన్ బెంచ్ కు బదిలీ చేసిన హైకోర్టు
- స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్
- వెకేషన్ బెంచ్ కు విచారణను బదిలీ చేయాలని కోరిన బాబు న్యాయవాదులు
- బాబు లాయర్ల విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన హైకోర్టు
హైకోర్టుల ఆదేశాల నేపథ్యంలో... దసరా సెలవుల్లో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వెకేషన్ బెంచ్ లో కొనసాగనుంది. మరోవైపు, హైకోర్టులో విచారణ సందర్భంగా చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తూ... ఈ కేసులోని ఇతర నిందితులు బెయిల్ పై ఉన్నారని... 40 రోజులుగా చంద్రబాబు విషయంలో జరుపుతున్న విచారణలో ఎలాంటి పురోగతి లేదని తెలిపారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని కోరారు.