తెలంగాణ సచివాలయంలో గంగవ్వ.. ఎంత పెద్ద బిల్డింగో అంటూ ఆశ్చర్యం.. వీడియో ఇదిగో!

తెలంగాణ సచివాలయంలో గంగవ్వ.. ఎంత పెద్ద బిల్డింగో అంటూ ఆశ్చర్యం.. వీడియో ఇదిగో!

youtuber Gangavva Telangana Secretariat visit
  • జీవితంలో మొదటిసారి ఇంత పెద్ద ఇల్లు చూస్తున్నానని వ్యాఖ్య
  • రాజభవనంలా కట్టారంటూ కితాబునిచ్చిన యూట్యూబర్
  • అనిల్ తో కలిసి అమరవీరుల స్థూపం సందర్శన
మై విలేజ్ షోతో పాటు బిగ్ బాస్ ద్వారా తెలుగు వారందరికీ పరిచయమైన గంగవ్వ తాజాగా తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని సందర్శించారు. యూట్యూబర్ అనిల్ గీలాతో కలిసి హైదరాబాద్ లో పర్యటించారు. సచివాలయం, అమరుల స్థూపం, ట్యాంక్ బండ్, చార్మినార్ లను చూశారు. ఈ సందర్భంగా సచివాలయం లోపలికి ప్రవేశించిన తర్వాత అనిల్ తో మాట్లాడుతూ.. అరవై నాలుగేళ్ల జీవితంలో తొలిసారి ఇంత పెద్ద భవనం చూస్తున్నానంటూ గంగవ్వ చెప్పారు. బిల్డింగ్ రాజభవనంలా ఉందని, ఇంత పెద్దగా ఎలా కట్టారని ఆశ్చర్యపోయారు.

సచివాలయంలోకి పోనివ్వరని అన్నావు కదా అనీల్.. గంగవ్వ అంటే ఏమనుకున్నావు, నన్ను చూసి లోపలికి అనుమతించారు చూశావా? అంటూ అనిల్ తో చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలంగాణ సచివాలయంలో గంగవ్వ కలియ తిరుగుతున్న ఈ వీడియోను బీఆర్ఎస్ నేతలు షేర్ చేస్తూ.. తెలంగాణ అభివృద్ధిని ప్రత్యక్షంగా చూస్తూ ఆశ్చర్యపోతున్న గంగవ్వ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Advertisement
gangavva
My village show
Youtuber
Secretariat
Telangana
Viral Videos

More Telugu News