వారాహి సభకు జగన్ సర్కారు అడ్డంకులు సృష్టించొచ్చు.. టీడీపీ శ్రేణులకు లోకేశ్ అలర్ట్
- అవనిగడ్డలో నేటి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర
- ‘వారాహి’ని విజయవంతం చేసేందుకు జనసేనతో టీడీపీ శ్రేణులు కలిసి నడవాలని లోకేశ్ పిలుపు
- వారాహి సభకు జగన్ సర్కారు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని హెచ్చరికలు
‘‘రేపటి నుంచి ప్రారంభమయ్యే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గారి నాలుగో విడత వారాహి యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. అవనిగడ్డలో జరగబోయే వారాహి బహిరంగ సభకు సైకో జగన్ సర్కార్ అడ్డంకులు కల్పించే అవకాశాలు ఉన్నాయి. వారాహి యాత్ర విజయవంతం చేసేందుకు తెలుగుదేశం శ్రేణులు జనసేనతో కలిసి నడవాలని కోరుతున్నాను’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.