కొత్త పోస్టర్ తో ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొత్త పోస్టర్ తో ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్

 Prabhas Salaar Release Date Posters
  • డిసెంబర్ 22న విడుదల కానున్న చిత్రం
  • ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న సినిమా
  • హీరోయిన్ గా శ్రుతీ హాసన్
ఈ ఏడాది సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘సలార్‌’. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌‌ టైనర్‌ పై విపరీతమైన అంచనాలున్నాయి. శ్రుతీ హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయక పాత్ర పోషించారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28వ తేదీనే విడుదల కావాల్సి ఉంది. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో విడుదలను వాయిదా వేశారు. ఇప్పుడు సలార్ విడుదల తేదీని చిత్ర యూనిట్ ఖరారు చేసింది. క్రిస్మస్‌ కానుకగా  సలార్‌‌ను డిసెంబర్‌‌ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించింది. 

ఈ మేరకు రిలీజ్ డేట్ తో కూడిన కొత్త పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కట్ బనియన్ లో ఉన్న ప్రభాస్ ఒంటిపై రక్తం, చేతిలో కత్తితో నిలుచున్నాడు.  ఈ సినిమాలో పృధ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కేజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించారు. కాగా, క్రిస్మస్ సమయంలోనే షారుక్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్లో వస్తున్న ‘డుంకీ’ విడుదల కానుంది. పఠాన్, జవాన్‌ చిత్రాలతో భారీ విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న షారుక్ తో ప్రభాస్ ఢీకొట్టనున్నాడు.
Advertisement
Prabhas
salaar
Release
new date
Poster

More Telugu News