రేపు 'వైఎస్సార్ వాహనమిత్ర' నిధులను విడుదల చేయనున్న సీఎం జగన్
- రేపు వైఎస్సార్ వాహనమిత్ర ఐదో విడత నిధుల విడుదల
- విజయవాడ విద్యాధరపురం స్టేడియంలో సభ
- బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్
రాష్ట్రంలో ఆటోలు, క్యాబ్ లు నడుపుకుంటూ ఉపాధి పొందుతున్న వారికి జగన్ ప్రభుత్వం ఏడాదికి రూ.10 వేలు చొప్పున సాయం అందిస్తోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు వాహనమిత్ర పథకంలో భాగంగా నాలుగు పర్యాయాలు నిధులు విడుదల చేశారు.
కాగా, రేపటి పర్యటన కోసం సీఎం జగన్ ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరనున్నారు. విద్యాధరపురం స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని, బటన్ నొక్కి నిధులు విడుదల చేస్తారు. సభ ముగిసిన అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.