కుక్క వాకింగ్‌తో ఊడిన కొలువు.. ఐఏఎస్ అధికారిణితో బలవంతపు రాజీనామా
- ఢిల్లీలోని త్యాగరాజ్ మైదానంలో కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లిన ఐఏఎస్ రింకూ దుగ్గా, ఆమె భర్త
- వారి కోసం క్రీడాకారులను నిర్వాహకులు ముందస్తుగానే మైదానంలోంచి పంపించేసిన వైనం
- ఘటన వివాదాస్పదం కావడంతో కేంద్రం సీరియస్
- ఉద్యోగానికి రాజీనామా చేసిన ఐఏఎస్ రింకూ దుగ్గా
ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో తన పెంపుడు కుక్కను వాకింగ్ చేయించేందుకు రింకూ దుగ్గా క్రీడాకారులను ముందుగానే పంపించివేయడం వివాదాస్పదంగా మారింది. సాధారణంగా ఈ స్టేడియం సాయంత్రం ఏడు గంటల వరకూ క్రీడాకారులకు అందుబాటులో ఉండాలి. ఈ క్రమంలో, పెంపుడు కుక్కను వాకింగ్ చేయించేందుకు రింకూ, ఆమె భర్త ఈ మైదానాన్ని వాడుకోవడం ప్రారంభించారు. ఈ జంట ఆదేశాల మేరకు నిర్వాహకులు నిర్ణీత సమయానికంటే ముందే క్రీడాకారులను బయటకు పంపించేసేవారు. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో రింకూ తన ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఆమె భర్త సంజీవ్ ఖిర్వార్ లడఖ్‌లో విధులు నిర్వహిస్తున్నారు.