రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నారా లోకేశ్ భేటీ
- స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో చంద్రబాబు అరెస్ట్
- ఢిల్లీలో మకాం వేసిన నారా లోకేశ్
- జాతీయ మీడియాకు తమ బాణీ వినిపించిన వైనం
- ప్రముఖులను కలుస్తూ మద్దతు కూడగడుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
తాజాగా నారా లోకేశ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. జగన్ పాలన అరాచకాలమయం అని, విపక్షాలను అణచివేస్తున్నారని లోకేశ్ రాష్ట్రపతికి వివరించారు.
ఈ సమావేశంలో లోకేశ్ పాటు టీడీపీ ఎంపీలు కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్ కూడా పాల్గొన్నారు. కాగా, టీడీపీ బృందం చెప్పిన విషయాలను రాష్ట్రపతి సానుకూలంగా విన్నట్టు తెలుస్తోంది.