కాంగ్రెస్ 70 నుంచి 74 స్థానాల్లో గెలుస్తుంది... గ్యారంటీ కార్డులు జాగ్రత్త!: మల్లు భట్టివిక్రమార్క
- అధికారంలోకి వచ్చాక ప్రతి హామీని తప్పకుండా అమలు చేస్తామన్న భట్టివిక్రమార్క
- తమ మేనిఫెస్టోను చూసి కాంగ్రెస్ ఆగమవుతోందని వ్యాఖ్య
- వచ్చే ఎన్నికల్లో న్యాయం, ధర్మం గెలుస్తాయన్న టీ కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత
- ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని వెల్లడి
కాంగ్రెస్ మేనిఫెస్టోను చూసి బీఆర్ఎస్ ఆగమవుతోందన్నారు. బీఆర్ఎస్ చెప్పే మాయమాటలను ప్రజలు నమ్మడం లేదన్నారు. పేదలకు కాంగ్రెస్ ఇచ్చిన భూములను తిరిగి అప్పజెబుతామని తెలిపారు. ప్రతి కార్యకర్తను పార్టీ కాపాడుకుంటుందని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర సంపదను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎన్నికల్లో న్యాయం, ధర్మం గెలుస్తాయన్నారు.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట అని, మొత్తం సీట్లు గెలుస్తామన్నారు. తాము ఇచ్చే గ్యారంటీ కార్డులను జాగ్రత్తగా పెట్టుకోవాలని సూచించారు. తాము ఆషామాషీగా గ్యారెంటీలు ఇవ్వడం లేదని చెప్పారు. లోతుగా పరిశీలించాకే గ్యారంటీ హామీలు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో సంపద ఉంది కాబట్టి గ్యారంటీగా హామీలను అమలు చేస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు.