Advertisement

చంద్రబాబు బెయిల్ పిటిషన్.. సీఐడీ కస్టడీ పొడిగింపు పిటిషన్లపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ

ACB Court to hear Chandrababu bail petition and CID custody petitions today
  • ముగిసిన చంద్రబాబు సీఐడీ కస్టడీ
  • మళ్లీ కస్టడీకి ఇవ్వాలని మోమో దాఖలు చేసిన సీఐడీ
  • కస్టడీ పొడిగింపుపై తమ వాదనలు కూడా వినాలన్న చంద్రబాబు న్యాయవాది
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఈరోజు విజయవాడలోని ఏసీబీ కోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై కోర్టు విచారణ జరపనుంది. మరోవైపు సీఐడీ రెండు రోజుల కస్టడీ ముగియడంతో, చంద్రబాబును మళ్లీ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు. చంద్రబాబు తరపు లాయర్ పోసాని కూడా కస్టడీ పొడిగింపుపై తమ వాదనలు కూడా వినాలని నిన్ననే కోర్టును కోరారు. ఈ రెండు అంశాలపై ఈరోజు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. ఇంకోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసుల్లో పీటీ వారెంట్ లపై విచారించాలని కూడా ఏసీబీ కోర్టును సీఐడీ కోరింది.
Advertisement
Chandrababu
Telugudesam
CID
Custody
Bail
ACB Court

More Telugu News